అట్టహాసంగా తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ డాలస్ చాప్టర్ ప్రారంభం

-

డాలస్: తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ (యు ఎస్ ఏ) డాలస్ చాప్టర్ ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. డాలస్ నగరంలోని పైలట్ నాల్ పార్క్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. డాలస్ ప్రాంతానికి చెందిన రెడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా హాజరయ్యారు.
రాజకీయ ఉద్యేశం తో కాకుండా, “కనెక్టింగ్ ది కమ్యూనిటీ” అనే సంకల్పం తో స్థాపించబడిన ఈ సంస్థ ముఖ్య ఉద్యేశం పెళ్ళీడుకొచ్చ్చిన యువతీయువకులకు తమ కమ్యూనిటీ లో వివాహ సంబంధాలు ఏర్పరుచుకోవడం మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన పేద రెడ్లకు సహాయసహకారాలు అందించటం అని ఈ సంస్థ నిర్వాహుకులు తెలియ చేయటం జరిగింది.
ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం లో రుచికరమైన తెలంగాణ ప్రాంత వంటకాల్ని అతిథులు ఎంతో ఇష్టంగా తిన్నారు.
జాతీయ స్థాయి సంస్థ గా ప్రారంభించబడిన తెలంగాణ ఎన్నారై రెడ్డీస్ (యు ఎస్ ఏ) త్వరలో అమెరికాలో ఇతర ముఖ్య పట్టణాల్లో రూపాంతరం చెందుతుందని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని రఘువీర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బొర్రా, శ్రీనివాస్ రెడ్డి కేలం, చంద్ర రెడ్డి పోలీస్, సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఎక్కటి, అనిల్ రెడ్డి బొడ్డు తదితరులు పర్యవేక్షించారు.

Category:
Comments (0)

Leave a Reply

Your email address will not be published.