ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి’ నాటక ప్రదర్శన

-

ఈ నెల 7న రవీంద్రభారతిలో 

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి’ నాటక ప్రదర్శన*

————————————————-

ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేలసంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల మహామాంత్రికుడు’ అంటారు. నోబెల్ బహుమతి రావాల్సిన వ్యక్తి . పెన్సిలిన్ కంటే ప్రభావవంతమైన యాంటీబయోటెక్ ‘క్లోరో టెట్రా సైక్లిన్’ ను ఆవిష్కరించినది ఆయనే. అలాగే, ఫ్లోరిక్ యాసిడ్ నుకనిపెట్టారు. కీమోథెరపీకి పునాది వేసిన మెడిసిన్ ‘మేథో ట్రెక్సీట్’‌ను, బోధకాలునునివారించే ‘పెట్రాజెన్’‌ను ఆయనే కనిపెట్టారు. ఒక్కటని కాదు… మలేరియా, ఫైలేరియా, ప్లేగు, క్యాన్సర్, ఎనీమియా, హృద్రోగ సమస్యలు – ఎన్నో వ్యాధులకు ఔషధాలు కనిపెట్టినమహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు. అయితే, ఆయన గురించి చాలామందికితెలియదు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలని, ఎవరూమర్చిపోకూడదని ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రచించారు. 

కాలేజీలో చదివే రోజుల నుంచి సింగీతం శ్రీనివాసరావుకు యల్లాప్రగడ సుబ్బారావు అంటేఅమితాసక్తి. ఎప్పటికైనా యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది సింగీతం యాంబిషన్. అమెరికాలో ప్రజలకు సీవీ రామన్, శ్రీనివాస రామానుజమ్ గురించి తెలుసు. కానీ, యల్లాప్రగడ గురించి తెలియదు. అందుకని, అమెరికాలోని యూనివర్సిటీల్లోప్రదర్శించడానికి, అక్కడి తెలుగు ప్రజలు అందరూ యల్లాప్రగడ గురించి తెలుసుకోవాలనిఆయనపై ఇంగ్లిష్ లో ఏడెనిమిదేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రాశారు. మన దేశంలోని తెలుగు ప్రజలు చాలామందికి ఆయన గురించి తెలియదనే ఉద్దేశంతో ‘అజ్ఞాత యశస్వి’ పేరుతో ఆ నాటకాన్ని డాక్టర్ 

రామ్ మోహన్ హోళగుండి తెలుగులోఅనువదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ – తెలంగాణ, నిషుంబితసమర్పణలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో నాటకాన్నిప్రదర్శించనున్నారు. 

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ “

నా కాలేజీ రోజుల నుంచి యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది  నా యాంబిషన్. ఆయనకు సంబంధించిన కంటెంట్ నా దగ్గర బోల్డంత ఉంది. ఆయన బయోపిక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేట్ బయోపిక్ అవుతుంది. 

మన వాళ్లకి మన చరిత్ర తెలియాలనే ఈ  నాటకం రాశా” అని అన్నారు.

Category:
Comments (0)

Leave a Reply

Your email address will not be published.