Successful completion of ATA Board meeting in Dallas,Texas

విజయవంతంగా జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు మీటింగ్

అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే6, 2023 న డాలస్,టెక్సా స్, అమెరికాలో జరిగిన బోర్డు సమావేశంలో అధ్యక్షురాలు మధు బొమ్మి నేని అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు జయంత్ చల్లా, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, పాలకమండలి బృందసభ్యు ల ఆధ్వర్యంలో ఎనిమిదిగంటలపాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజనల్ అడ్వయిసర్స్ , రీజనల్ కోఆర్దినేటర్స్ , వుమెన్ కోఆర్దినేటర్స్ , స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వయిసర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యా రు. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు.

ఆటా సంస్థ అధ్యక్షురాలు మధు బొమ్మి నేని 2023 సంవత్సరములో జనవరి నుండిఏప్రిల్ వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ముందుగా వివిధ నగరాలలో ముమ్మరంగా జరిపిన పద్దెనిమిదిమహిళా దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో జరగడము ఇదేమొదటి సారి అని వ్యక్తం చేసారు. అలాగే ఇమిగ్రేషన్ వెబినార్,హోలి, ఇల్లు లేని వారికి ఆహర సరఫరా సేవా, మహిళలకు రంగోలి, వంటల పోటీలు, మహిళల క్రికెట్, త్రోబాల్ క్రీడా కార్యక్రమాలు, ఆటా డే ఉత్సవాలు చేసిన ఆటాకార్యవర్గ బృందానిని కొనియాడుతూ వారికున్న ఉత్సా హానికి, సేవానిరతికి కృతజ్ఞతతో అంజలి ఘటించారు. ప్రతీ వారము ఆటాకొనసాగిస్తున్న యోగా కార్యక్రమములో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పర్చు కోవల్సి ందిగా అమెరికా వాసులందరికి పిలుపునిచ్చా రు. సంస్థ అందచేస్తున్న టెక్నా లజి , ఉన్నత విద్యా భివృద్దికి సంబందించిన సేల్స్ ఫోర్స్ మరియు సాట్ శిక్షణలగురించి, అమెరికాభారతి ఆటా 2023 మొదటిత్రైమాసిక పత్రిక ఏప్రిల్ 1 న విడుదల చేసామని, ద్వితీయ త్రైమాసిక పత్రిక కవర్పేజి కోసం యువత కి ‘ఆర్ట్ పోటీ’ నిర్వహిస్తున్నా ము అని తెలియచేసారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యు లు గతసంవత్సరం ఆటా
సంబరాలకు పెద్ద మొత్తములో దాతగా నిలబడి, మెడిటేషన్ గురించి అమెరికా వాసులకిఅంతర్జాలములో శిక్షణను కలిగించినందుకు అభినందిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా దాతలుగా నిలిచిన ఆటా పూర్వధ్యక్షులకు, పాలకమండలి సభ్యు లకు ధన్యవాదాలు తెలియపరిచారు.

ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అమెరికాలోనే కాకుండా ‘టర్కీ యెర్త్ క్వేక్’ కి ధనసహాయం రెడ్ క్రాస్ సంస్థ తో సమన్వయంగాచేయడం, అలాగే తెలంగాణ గ్రామీణ మహిళల కోసం ‘యెనేమియా అవేర్నెస్’ ప్రోగ్రాం ద్వా రా విటమిన్స్ అందచేయడానికి తగిన నిధులు జమచేసిపంపడం జరుగుతుందిఅని, నిరంతరంగా సేవా సహాయ, కార్యక్రమాలలో సంస్థకార్యవర్గం ముందంజలో ఉంటుంది అని పేర్కొ న్నా రు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని కొనియాడారు.

ఆటా లో అత్యధికంగా కొత్త సభ్యు లని చేర్చినవారికి ‘మోస్ట్ వాల్యు బుల్ పర్సన్ అఫ్ దిమంత్’ గా గుర్తింపుని మార్చ్ మాసం రాలీ నుండి శృతి చామల గడ్దం, ఏప్రిల్ మాసం సాండియేగో నుండి కాశప్ప మదారం గారులకు, అలాగే ఫస్ట్ క్వా ర్టర్ లో మంచికార్యక్రమాలను పెద్దమొత్తంలో చేస్తున్న జాబితాలో ‘మోస్ట్ వాల్యు బుల్ సిటీ అఫ్ ది మంత్’ గా ఫీనిక్స్ నగరాన్ని గుర్తించి సంస్థ అభినందించింది అని సమావేశములో తెలియపరుస్తూ, అధిక సంఖ్యలో సంస్థలో సభ్యు లను చేర్చడానికి, వినూత్నంగా భాష,సంగీత, సాహిత్య, నృత్య కార్యక్రమాలను, మరెన్నో సహాయకార్యక్రమాలను చేయాలని కార్యవర్గబృందాన్ని ప్రోత్సహించారు.

అట్లాంటాలో ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18 వ కన్వెన్షన్ & యూత్ కాన్ ఫరెన్స్ జార్జియా వర్ల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జరపడానికి పాలకమండలి సభ్యు లు నిర్ణయించారు.అమెరికా తెలంగాణ సంఘం అమెరికా తెలుగు సంఘం లో ఐక్యమవ్వా లనే ప్రతిపాదనని పాలకమండలి సభ్యు లు ఆమోదించారు. కలిసి పని చేసే ప్రాతిపదిక పై కమిటీని నిర్ణయించారు. అధ్యక్షురాలు మధు బొమ్మి నేనిఆటా ప్రతి కార్యక్రమానికిసహకరిస్తున్న మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Actor Sudheer Babu exclusive interview about his movie “Hunt”

కృష్ణగారు ‘హంట్’ చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నా… సినిమా చూశా, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది! – సుధీర్ బాబు ఇంటర్వ్యూ  నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్

Read More »

 ATA Ugadi Cultural virtual Zoom meeting  ‘అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఉగాది సాహిత్య సదస్సు’

అమెరికా తెలుగులు సంఘం (ఆటా) శనివారం ఏప్రిల్ 1, 2023 ‘సంగీత సహిత్య సంలంకృతే’ శీర్షికతో ‘ఆటా ఉగాదిసాహిత్య సదస్సు ‘కార్యక్రమం అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మి నేని, మరియు కార్యవర్గబృందం ఆధ్వర్యంలో వర్చు

Read More »

Telugu Association of North Texas has formed a new team for 2023.

శరత్ రెడ్డి ఎర్రం నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం  (టాoటెక్స్) 2023 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జనవరి 8, 2023, డాలస్/ఫోర్ట్ వర్త్            తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక

Read More »

TANTEX Ugadi Celebrations 2022

  అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు  పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేస్తున్న టాంటెక్స్ సంస్థ  అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధిపతి వెంకట్ ములుకుట్ల గారి అధ్యక్షతన డాలస్

Read More »