TANA Foundation Graduate Scholarships distributed at Dallas, Texas

మార్చి 03, డాలస్( టెక్సస్): డల్లాస్‌లోని తానా ఫౌండేషన్..పలువరు తెలుగు విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందించి వారి బంగరు భవిష్యత్తుకు బాటలు వేసింది. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపుతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో విద్యకు వున్న ప్రాధాన్యత చాల గొప్పదని, విద్యవలన విజ్ఞానం వస్తుందని, సమాజంలో ఎలా బ్రతకాలి తెలుస్తుందని పేర్కొన్నారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కోశాధికారి పోలవరపు శ్రీకాంత్, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి , మురళి వెన్నం, పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర ,లోకేష్ నాయుడు, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, తానా ఫౌండేషన్ బృందం సారధ్యంలో “విద్య జీవితానికి వెలుగునిస్తుంది ” అనే నినాదంతో అమెరికాలో విద్యను అభ్యసిస్థున్న తెలుగు విద్యార్ధులకు వారి కుటుంబ పరిస్థితులను పరిశీలించి, అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లు అందించారు.

గత 15 సంవత్సరాలుగా తానా ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్ షిప్‌లకు అర్హులైన అర్హులైన వారిని ఎంపిక చెయ్యడంలో సహాయ సహకారాలు అందించిన డా. ప్రసాద్ కాకర్ల MD, DCH, FAAP”కు తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, కోశాధికారి పోలవరపు శ్రీకాంత్, వారి కార్యనిర్వహణ బృందం ధన్యవాదాలు తెలియజేశారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ గారు మాట్లాడుతూ..ఫౌండేషన్ ఈ సంవత్సరం ఇండియాలో ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ఇంతకు ముందుకంటే మరిన్ని సేవా కార్యక్రమాలను చెపట్టడం జరిగింది అని చేప్పారు. తానా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా వున్నాయని చాలామంది దాతలు డోనార్ కేటగిరిలో విరాళాలు ఇవ్వడానికి ముందుకువచ్చారని తెలియజేశారు. దాతల ఉదారత తానా ఫౌండేషన్ కార్యనిర్వహణ బృందానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి స్పూర్తినిచ్చిందని, దాతలు అందరికి దన్యవాదాలు తెలియజేశారు. తానా ఫౌండేషన్ వారు ఇండియాలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ,క్యాన్సర్, నేత్ర శిబిరాలు, డిజిటల్ శిక్షణ తరగతులు, స్కూల్ గ్రంధాలయాలు, గ్రామాలలో మంచి నీటి కార్యక్రమాలు, అనాధ శరణాలయాలకు ఆదరణ … ఇంకా మరెన్నో కార్యక్రమాలను పేదప్రజలకు అందించడం చాలా ఆనందంగా వుందన్నారు.

తానా ఫౌండేషన్ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ వారు తీసుకొస్తున్న మంచి కార్యక్రమాలకు నావంతు పూర్తి సహకారం వుంటుందని, కోశాధికారిగా మరిన్ని నిధులను చెకూర్చడంలో ఎంతో కృషిచేస్తాను అని తెలియజేశారు.

తానా ఫౌండేషన్.. విద్యార్ధులకు అందిస్తున్న స్కాలర్ షిప్ కార్యక్రమం ఎంతో గొప్పది అని భావించి, కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ప్రయోజకులైతే, వారి తరువాతి తరం వారికి సహకారం అందించినట్లు అవుతుందని నమ్మి, టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం లో నివసిస్తున్న వెంకట రమణ కొల్లా ముందుకు వచ్చి UNT లో చదువుకుంటున్న ఒక విద్యార్ధికి ఒక సెమిస్టెర్‌కు అయ్యే ఖర్చు మొత్తం విరాళంగా ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు.

యార్లగడ్డ రమణ, పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర, MVL ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. పుదుర్ జగదీశ్వరన్, మురళి వెన్నం, లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, ఉమామహెష్ పార్నపల్లి(టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల(టాంటెక్స్ – Chair BoT), లెనిన్ వెముల, ప్రమోద్ నూతేటి, చినసత్యం వీర్నపు విద్యార్ధులకు స్కాలర్షిప్‌లను అందజేశారు. స్కాలర్ షిప్ లను అందుకున్న విద్యార్ధులు తానా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

స్కాలర్షిప్ ఇవ్వడానికి సహకరించిన దాతలు – రవీంద్రనాధ్ గుత్తికొండ దంపతులు, గద్దే సీతారామమ్మ తిరుపతయ్య, గుత్తికొండ బాలమణి రామబ్రహ్మం, గుత్తికొండ బసవపున్నరావు ఉమాదేవి, కొడాలి వీరయ్య సరోజని, యుగంధర్ వల్లభనేని దంపతులు, తానా ఫౌండేషన్, ప్రసాద్ కాకర్ల దంపతులు, సాయి రమేష్ బిక్కిన దంపతులు, డా. మోటూరు భాను ప్రసాద్ మెమోరియల్, ప్రసాద్ దేవభక్తుని, డా. లోకెశ్వరావు స్కాలర్షిప్, జే తాళ్ళూరి స్కాలర్షిప్, పుట్టా వెంకటరావు స్కాలర్షిప్, జానకిరామ కొడుదు స్కాలర్షిప్, వెలమాటి ప్రసాద్ ఉదారతను కొనియాడారు.

స్కాలర్షిప్ ఇవ్వడానికి సహకరించిన Universities– University of Dallas (UTD), Western Illinois University, New Jersy Institute of Technology, Pittsburg State University, University at Albany, MSU Texas, University of North Texas(UNT), North Carolina Tech State University, University of Texas AT Arlington, Mississippi State University, University of New Haven, Southern Arkansas University, Trine University, North Eastern University లకు తానా వారు దన్యవాదాలు తెలియజేశారు.

తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ , కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ తానా ఫౌండేషన్ Trustees అయిన – విశ్వనాథ్ నాయునిపాటి, రమాకాంత్ కోయ, రవి సామినేని, సురేష్ పుట్టగుంట, శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, కిరణ్ గోగినేని, పురుషొత్తం సి గుదే, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రాంశెట్టి, విధ్యాధర్ గారపాటి, ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సహాయ సహకారాలను అభినందించారు.ఇటువంటి సమాజసేవాకార్యక్రమాలు చేపట్టడానికి, తానా లాంటి స్వచ్చంద సంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు మరియు కార్యకర్తలకు తానా ఫౌండేషన్ బృందం ధన్యవాదాలు తెలియజేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ, కోశాధికారి పోలవరపు శ్రీకాంత్, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మాట్లాడుతూ.. మరిన్ని జన ప్రయోజనకరమైన కార్యక్రమాలతో అన్ని సంస్థలతో కలసి పనిచేసేందుకు తానా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, రాబోయే కాలంలో తానా(TANA) అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు తానా బృందం సహకారంతో మీ ముందుకు తీసుకువస్తామని, అందరు తానా ఫౌండేషన్ బృందం వారు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అందరికి, సహకారం అందించిన ప్రసార మాధ్యమాలకు, వేదికను అందించిన మైత్రి రెస్టారెంట్ వారికి శ్రీకాంత్ పోలవరపు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TANTEX 176th NNTV Literary Seminar

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 176 వ నెల నెలా తెలుగు వెన్నెల మరియు 48 వ టెక్సస్ తెలుగు సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. సాహిత్య

Read More »

Actor Sudheer Babu exclusive interview about his movie “Hunt”

కృష్ణగారు ‘హంట్’ చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నా… సినిమా చూశా, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది! – సుధీర్ బాబు ఇంటర్వ్యూ  నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్

Read More »