Telugu Association of North Texas has formed a new team for 2023.

శరత్ రెడ్డి ఎర్రం నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం  (టాoటెక్స్) 2023 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

జనవరి 8, 2023, డాలస్/ఫోర్ట్ వర్త్  

         తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే  ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్) వారు 2023 సంవత్సరానికి  ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 8 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో  ప్రకటించారు. ఈ సందర్బంగా శరత్ రెడ్డి ఎర్రం సంస్థ అధ్యక్షుడుగా  పదవీబాధ్యతలు స్వీకరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్) లాంటి గొప్ప సంస్థ కి  అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్) ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్)  సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని తెలియజేసారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం

అధ్యక్షుడు : శరత్ రెడ్డి ఎర్రంసంయుక్త కార్యదర్శి : స్రవంతి యర్రమనేని
ఉత్తరాధ్యక్షుడు: సతీష్ బండారుకోశాధికారి:  రఘునాథ రెడ్డి కుమ్మెత
ఉపాధ్యక్షులు : చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటిసంయుక్త కోశాధికారి:  రాజా మాగంటి
కార్యదర్శి :  మాధవి లోకిరెడ్డితక్షణ పూర్వాధ్యక్షులు: ఉమామహేష్ పార్నపల్లి

సురేష్ పఠనేని, సుబ్బారెడ్డి కొండు,  కళ్యాణి తాడిమేటి, ఉదయ్ కిరణ్ నిడిగంటి , శ్రీనివాసులు బసాబత్తిన, దీప్తి సూర్యదేవర, శాంతి నూతి, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, విజయ్ సునీల్ సూరపరాజు, లక్ష్మినరసింహ పోపూరి, రాజాప్రవీణ్ బాలిరెడ్డి, చైతన్యరెడ్డి గాదె

పాలక మండలి బృందం

అధిపతి : అనంత్ మల్లవరపు, ఉపాధిపతి: డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము

గీతా దమ్మన్న, హరి సింగం, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంట, హరి సింగం

డాక్టర్ కొండా తిరుమల రెడ్డి, సురేష్ మండువ

కొత్త పాలక మండలి మరియు  కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో ,సరికొత్త ఆలోచనలతో 2023 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని  సంస్థ నూతన అధ్యక్షులు శరత్ రెడ్డి ఎర్రం తెలిపారు.

2022 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా  పని చేసి,  పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు  ఉమామహేష్ పార్నపల్లి మాట్లాడుతూ  శరత్ రెడ్డి ఎర్రం గారి నేతృత్వంలో ఏర్పడిన 2023 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు  సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన సాక్షి, టీవీ 5, మన టి.వి, టీవీ 9 లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

మరిన్ని వివరాలకు www.tantex.org ని   సందర్శించండి.

ధన్యవాదాలతో,

శరత్ రెడ్డి ఎర్రం

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాoటెక్స్ ) కార్యవర్గం మరియు పాలక మండలి 2023.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

TANTEX Nela Nela Telugu (NNTV) Vennela 177th Literary Seminar 2022

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 10న జరిగిన 177 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. కోవిడ్ వలన గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం

Read More »

Telugu Association of North Texas has formed a new team for 2023.

శరత్ రెడ్డి ఎర్రం నేతృత్వంలో ఏర్పడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం  (టాoటెక్స్) 2023 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జనవరి 8, 2023, డాలస్/ఫోర్ట్ వర్త్            తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక

Read More »

TANA Foundation Graduate Scholarships distributed at Dallas, Texas

మార్చి 03, డాలస్( టెక్సస్): డల్లాస్‌లోని తానా ఫౌండేషన్..పలువరు తెలుగు విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందించి వారి బంగరు భవిష్యత్తుకు బాటలు వేసింది. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా

Read More »