అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో కొత్త విమానాశ్రయాలపై చర్చించారు.కుప్పం, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు విమానాశ్రయాలను పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన ముయిసాదా ఆర్‌ఎఫ్‌పీని కేబినెట్ ఆమోదించింది. భూసేకరణ, యుటిలిటీల బదిలీ కోసం హడ్కో నుండి రుణం తీసుకుంటారు. విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. దీనికి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు చేయగా ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Authored by: Vaddadi udayakumar