కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్‌లో అశ్లీల కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. జస్టిస్ …
Read More »International
అమెరికలో అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. స్వయంగా స్వదేశాలకు వెళ్లేవారికి ఇప్పటికే నగదు ఆఫర్ చేసింది. అయితే క్రిస్మస్,న్యూఇయర్ సందర్భంగా అక్రమవలసదారులకు మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని ఏకంగా 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లేవారికి 3 వేల డాలర్లు అంటే మన …
Read More »హెచ్1బీ వీసా పొందాలంటే అక్టోబరు దాకా ఎదురుచూపులు తప్పవా?
ఆందోళన చెందుతున్న భారతీయ దరఖాస్తుదారుడు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా ఖాతాల పరిశీలన పాలసీ వల్ల భారత హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలువురు దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకూ వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ద్వారా భారతీయులు తెలుసుకుని తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం …
Read More »బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగం 21కి వాయిదా
తిరుపతి,ఐఏషియ న్యూస్: ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే రాకెట్ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ …
Read More »పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం: ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: సామాజిక మాధ్యమాలకు బానిసలై అందులో నుంచి బయటికి రాలేని వారు చాలామంది ఇప్పుడు ఎన్నో అవస్థలు పడుతున్నారు.ఇక చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడటం పట్ల మరింత ఎక్కువ ఆందోళనకరంగా మారుతోంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా బారినపడి చిన్నారులు ఎంతలా మారిపోతున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం.ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని నియత్రణలో ఉంచాలనే డిమాండ్లు ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో చిన్నారులకు.. సోషల్ మీడియా వాడకుండా కఠిన ఆదేశాలు ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్న వేళ.. ఆస్ట్రేలియా …
Read More »అతి చిన్నదేశపు ఒక్కనోటు మన కరెన్సీలో 7 లక్షలకు సమానం
షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం సుమా బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ కరెన్సీ గురించిన మాట్లాడుకుంటే చాలా మంది అమెరికా డాలర్ లేదా యూరో అనుకుంటారు. కానీ ఓ చిన్న దేశానికి సంబంధించిన ఒకే ఒక్క నోటు మన దేశపు కరెన్సీలో దాదాపు 7 లక్షలకు సమానం.ఇంతకీ ఆ దేశం ఏది? ఆ నోటు విశేషాల గురించి మాట్లాడుకుంటే.ఆ దేశం పేరు బ్రూనై. ఆ దేశపు 10,000 డాలర్ల నోటు భారత కరెన్సీలో దాదాపు రూ.6.8 లక్షలకు సమానం. Vice.com …
Read More »డల్లాస్ లో పర్యటించిన నారా లోకేష్
తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం అండ డల్లాస్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు ఎన్.ఆర్.ఐలనుద్దేశించి ప్రసంగించారు. కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో వేలాది మంది తెలుగు ప్రవాసుల సమక్షంలో లోకేష్ మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలబడిన తెలుగు డయాస్పోరాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రవాస భారతీయులను (ఎన్.ఆర్.ఐలను) ప్రశంసిస్తూ వారిని “మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్” గా అభివర్ణించారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా …
Read More »ఉన్నత చదువుల కోసం వెళ్లి అనంత లోకాలకు
బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి అలబామా(అమెరికా),ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో నివసిస్తున్న పది మంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు.అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు, కేకలు వేశారు.లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …
Read More »జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి ఉజ్మాఖాన్ కరాచీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మానసికంగా ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ వెల్లడించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఆమె కలిశారు. సోదరుడ్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మానసికంగా చాలా ధృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు, …
Read More »జనవరి 1 న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: క్షణాలు,నిమిషాలు, గంటలు,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలు.. ఇలా కాలం గిర్రున తిరుగుతోంది. ఠక్కున క్యాలెండర్ మారిపోతోంది. మరీ క్యాలెండర్ కథేంటి? జనవరి 1వ తారీఖునే కొత్త సంవత్సరం అని సంబరాలు చేసుకుంటారు ఎందుకు? అసలు సంవత్సరాన్ని లెక్కించడానికి ప్రమాణం ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి కదూ.అయితే ఈ క్యాలెండర్ కహాని తెలియాలంటే కొన్ని దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. కాలం వేసిన బలమైన ముద్రలను లోతుగా పరిశీలించాల్సిందే. ప్రపంచానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం …
Read More »
News Website (iasianews.net) I Asia News