Category Archives: Entertainment

175th Nela Nela Telugu Vennela (NNTV) Sadassu-TANTEX-Feb 20th, 2022

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175 వ సాహితీ సదస్సు ఫిబ్రవరి 20th 2022 డాలస్, టెక్సస్ లో ఆసక్తికరంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారిని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ గారు తన ప్రసంగంలో “అందరినీ ఆకట్టుకునే కథా రచన – ఒక కథా రచయిత్రి మనోభావాలు” అన్న […]

Meet & Greet with Smt. Ramani Balabhadrapatruni (Indian litterateur, novelist, playwright, screenwriter, dialogue writer and film critic.

Picture Courtesy: Subramanyam Jonnalagadda ఈ రోజు నా రాక సందర్భంగా ఏర్పాటైన Greet and Meet , డాలస్ లో పసంద్ బాంక్వెట్ హాల్ లో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం లో తోటకూర ప్రసాద్ గారూ,సుబ్బూ జొన్నలగడ్డ గారూ చంద్రా కన్నెగంటి గారూ శారదా సింగిరెడ్డి గారూ లక్ష్మీ పాలేటి గారూ డా.హిమబిందు(Malaysia) గారూ అరుణ జ్యోతి గారూ TV9 వెంకట్ ములుకుంట్ల గారూ,చిన సత్యం గారూ,రమణా జువ్వాది గారూ,అనంత్ మల్లవరపు గారూ..సరదా గా […]

డాలస్ లో విజయవంతంగా జరిగిన తానా కళాశాల అభినందన కార్యక్రమం

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో  పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.  ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో  ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ […]

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి’ నాటక ప్రదర్శన

ఈ నెల 7న రవీంద్రభారతిలో  ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు రచించిన ‘అజ్ఞాత యశస్వి’ నాటక ప్రదర్శన* ————————————————- ప్రపంచం గర్వించదగ్గ తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఐదువేలసంవత్సరాల్లో… ఆయన కనిపెట్టినన్ని ఔషధాలు, ఆయన చేసినన్ని పరిశోధనలు – ప్రయోగాలు చరిత్రలో ఎవరూ చేయలేదు. ఆయనను ‘మందుల మహామాంత్రికుడు’ అంటారు. నోబెల్ బహుమతి రావాల్సిన వ్యక్తి . పెన్సిలిన్ కంటే ప్రభావవంతమైన యాంటీబయోటెక్ ‘క్లోరో టెట్రా సైక్లిన్’ ను ఆవిష్కరించినది ఆయనే. అలాగే, ఫ్లోరిక్ యాసిడ్ నుకనిపెట్టారు. కీమోథెరపీకి పునాది వేసిన మెడిసిన్ ‘మేథో ట్రెక్సీట్’‌ను, బోధకాలునునివారించే ‘పెట్రాజెన్’‌ను ఆయనే కనిపెట్టారు. ఒక్కటని కాదు… మలేరియా, ఫైలేరియా, ప్లేగు, క్యాన్సర్, ఎనీమియా, హృద్రోగ సమస్యలు – ఎన్నో వ్యాధులకు ఔషధాలు కనిపెట్టినమహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు. అయితే, ఆయన గురించి చాలామందికితెలియదు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలని, ఎవరూమర్చిపోకూడదని ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రచించారు.  కాలేజీలో చదివే రోజుల నుంచి సింగీతం శ్రీనివాసరావుకు యల్లాప్రగడ సుబ్బారావు అంటేఅమితాసక్తి. ఎప్పటికైనా యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది సింగీతం యాంబిషన్. అమెరికాలో ప్రజలకు సీవీ రామన్, శ్రీనివాస రామానుజమ్ గురించి తెలుసు. కానీ, యల్లాప్రగడ గురించి తెలియదు. అందుకని, అమెరికాలోని యూనివర్సిటీల్లోప్రదర్శించడానికి, అక్కడి తెలుగు ప్రజలు అందరూ యల్లాప్రగడ గురించి తెలుసుకోవాలనిఆయనపై ఇంగ్లిష్ లో ఏడెనిమిదేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు ఓ నాటకం రాశారు. మన దేశంలోని తెలుగు ప్రజలు చాలామందికి ఆయన గురించి తెలియదనే ఉద్దేశంతో ‘అజ్ఞాత యశస్వి’ పేరుతో ఆ నాటకాన్ని డాక్టర్  రామ్ మోహన్ హోళగుండి తెలుగులోఅనువదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ – తెలంగాణ, నిషుంబితసమర్పణలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు రవీంద్రభారతిలో నాటకాన్నిప్రదర్శించనున్నారు.  సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ “ నా కాలేజీ రోజుల నుంచి యల్లాప్రగడ బయోపిక్ తీయాలనేది  నా యాంబిషన్. ఆయనకు సంబంధించిన కంటెంట్ నా దగ్గర బోల్డంత ఉంది. ఆయన బయోపిక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేట్ బయోపిక్ అవుతుంది.  మన వాళ్లకి మన చరిత్ర తెలియాలనే ఈ  నాటకం రాశా” అని అన్నారు.