విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో నెలరోజులు పాటు ఘనంగా నిర్వహించిన శ్రావణ లక్ష్మి పూజలు శనివారం నిర్వహించిన మహా పూర్ణహుతితో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే. శోభరాణి, వేద పండితులు,అర్చకులు,ఉభయదాతలు, సిబ్బంది పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar