సింహాచలం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని గుజరాత్ హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన జడ్జికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు ఆదేశాల మేరకు, సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పి ఆర్ ఓ నాయుడు నాదస్వర, వేదమంత్రాల మధ్య స్వామివారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు.ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న జడ్జి మానవేంద్రనాథ్ రాయ్ ఆ తర్వాత బేడా మండపంలో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం, వేదపండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా, సహాయ కార్యనిర్వహణాధికారి కె.తిరుమలేశ్వరరావు,పరివేక్షణ అధికారి బరువు శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో జడ్జిని సత్కరించి, స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.
Authored by: Vaddadi udayakumar
Check Also
9న పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయనగరం,ఐఏషియ న్యూస్: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ఈనెల 9వ తేదీన ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ …