బిజెపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు
సుజాతనగర్(విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్),ఐఏషియ న్యూస్: అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో సెప్టెంబర్ 8న జరగబోయే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ “సారథ్యం శోభాయాత్ర” విజయవంతం చెయ్యాలని కోరుతూ పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, బిజెపి 95,97వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ ల ఆధ్వర్యంలో బిజెపి 95,97వ వార్డుల పదాధికారులు,బిజెపి కార్యకర్తలు,అభిమానులతో ముఖ్య సమావేశం చినముషీడివాడలో శనివారం నాడు జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యం శోభాయాత్ర విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర ప్రసాద్, ప్రధానకార్యదర్శి గొర్లిరామునాయుడు, బాలసుబ్రహ్మణ్యం,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు గురునాథ్,బిజెపి 95,97వ వార్డుల సోషల్ మీడియా కన్వీనర్ కంచిబోయిన వెంకట సంతోష్, వివిధ పదవుల్లో ఉన్నబిజెపిముఖ్యనాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పెద్దఎత్తున పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar