టెక్సాస్,ఐఏషియన్ న్యూస్: అమెరికాలోని టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా మరో 27 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు ఈమేరకు అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అమెరికాలోని టెక్సాస్ నగరం అల్లకల్లోలంగా మారింది. కెర్ కౌంటీలోని గ్వాడలుపే నది నీటి ఉద్ధృతికి ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో నదీ ఒడ్డున సమ్మర్ క్యాంపులు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించనట్లు పేర్కొన్నారు.వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కెర్ కౌంటీలో 59 మంది మృతి చెందగా.. ట్రావిస్ కౌంటీలో 4, బర్నెట్ కౌంటీలో 3, కెండాల్ కౌంటీలో ఒకరు చొప్పున మరణించారని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతోనే మృతుల సంఖ్య పెరిగనట్లుఅధికారులుఅభిప్రాయపడుతున్నారు. అంతేకాక అనేక నివాసాలు నీట మునిగి వీధుల్లోకి భారీగా వరద నీరు చేరిందని తెలిపారు. పలు వాహనాలు కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని రక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.మృతుల కుటుంబాలకు పోప్ లియో సంతాపం తెలిపారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిష్టి నోయిమ్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఆబ్బోట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని వివరించారు. టెక్సాస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ట్ బ్రోకెన్ అని తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
సహాయక చర్యలు చేపడుతున్న అమెరికా ప్రభుత్వం
టెక్సాస్ వరదలపై భారత ప్రధాని మోడీ సంతాపం
టెక్సాస్ వరదలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.