సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జగదీప్ దన్‌ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్రకటించింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారుసెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు.
Authored by: Vaddadi udayakumar