9న భారత్ బంద్

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజావర్గాల ఆందోళనకు ప్రతిఫలంగా నిలుస్తోంది.బంద్‌కు కారణమైన ప్రధాన అంశం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న “ప్రో-కార్పొరేట్ విధానాలు”. కార్మిక సంఘాల ప్రకారం,గత కొన్ని సంవత్సరాలుగా  “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” పేరిట తీసుకొస్తున్న నిర్ణయాలు కార్మిక వర్గాలను పక్కన పెట్టేలా మారాయని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల భద్రత, శ్రమ చట్టాలరక్షణను తగ్గిస్తూకంపెనీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు గౌరవమైన జీవితం కూడా లభించడం లేదు, భద్రత కూడా ఉండటం లేదు.ఈ బంద్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాలఫోరంపిలుపునిచ్చింది. ఇందులో పలు కీలక రంగాలు భాగం బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం,పోస్టల్ సర్వీసులు, కోల్ మైనింగ్, హైవే నిర్మాణం,రవాణా రంగాలు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలు,రైతు సంఘాలు, గ్రామీణ కూలీలుతీసుకుంటున్నాయి.ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కి చెందిన అమర్జీత్ కౌర్ ప్రకారం, గ్రామీణ ప్రాంత రైతులు, కార్మికులు కూడా ఈ బంద్‌లో భాగం కానున్నారు. ఇది ఒకఎత్తున నగరాల్లో ఉద్యోగుల చైతన్యం, మరోఎత్తున గ్రామాల్లో రైతుల ఆక్రోశం.

బ్యాంకింగ్,పోస్టల్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం

వీరి డిమాండ్లు ఏమిటి?

ఈ సమ్మె తాలూకు డిమాండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడం. ఎంజీఎంఆర్ ఈజిఏ పనిదినాలు పెంపు, వేతనాలలో పెరుగుదల. నగరాల్లోనూ ఎంజీఎంఆర్ ఈజిఏ తరహా పథకాలు. కనీస వేతన భద్రత ఉండాలి. జనాభా ఆధారంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి. ఉద్యోగ సంబంధిత ప్రోత్సాహక పథకం (ఈ ఎల్ ఐ) పరశీలించి దీనిని కేవలం కంపెనీలకు మాత్రమే లాభం కాకుండా ఉద్యోగులకు సహకరించేలా మారాలి. రేపు జరగనున్న భారత్ బంద్‌ ప్రభావం ప్రధానంగా ఆర్థిక మరియు రవాణా రంగాలపై కనిపించేలా ఉంది. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రకటనలతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయేసూచనలుస్పష్టంగాకనిపిస్తున్నాయి. బెంగాల్ ప్రొవిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకారం,బ్యాంకులు ఈ బంద్‌కు మద్దతుగా తమ సేవలు నిలిపివేయనున్నాయి. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఏటీఎంలుపనిచేయకపోవచ్చు, కాష్ తీసుకునే ప్రక్రియలో అంతరాయాలు ఏర్పడవచ్చు.అలాగే,పోస్ట్ ఆఫీసుల పనితీరుపైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ రవాణా సేవలు, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు, ఫ్యాక్టరీలు కూడా బంద్ రోజున పనిచేయకపోవచ్చు.ఈ నేపథ్యంలో ప్రజలు తమ దినచర్యలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.భారత్ బంద్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం నుంచీ పాఠశాలలు లేదా కళాశాలలనుమూసివేయాలని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల,విద్యా సంస్థలు సాధారణంగా పనిచేసే అవకాశముంది. అలాగే, బ్యాంకులు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల తరఫున కూడా ఎలాంటి సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ, బ్యాంకింగ్ సేవలలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, వినియోగదారులు బ్యాంకుకు వెళ్లే ముందు సేవల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది.

About admin

Check Also

ఈ యాప్ ఉంటే చాలు.. కల్తీ మద్యం కనిపెట్టొచ్చు..ఏపీ ప్రభుత్వం ఆలోచన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *