60 మంది సామాన్య ప్రజలతో పాటు 11 మంది జవాన్లు గల్లంతు
ఉత్తర కాశీ,ఐఏషియ న్యూస్: దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలీ వరదల్లో హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న జేసీఓ సహా మొత్తం 11 మంది జవాన్లు గల్లంతు అయినట్లువార్తలువస్తున్నాయి.ప్రస్తుతంఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తర కాశీలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి.దేవభూమిగా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉత్తర కాశీ జిల్లాలో ధరాలీ గ్రామంలో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు వ్యాప్తి చెందాయి. ఈ ఘటనలో నీటి ప్రవాహానికి వందల ఇళ్లు కొట్టుకుపోయాయి.దాదాపు 60 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Authored by: Vaddadi udayakumar