పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక మృతి

అనంతగిరి,ఐఏషియ న్యూస్: పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటుతో బాలిక చనిపోయిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాలు. ప్రకారం.మండలంలోని మంగళవారం చెరుకుమడత పరిసర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పిడుగు పడింది.ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బట్నాయిని కీర్తి(16) పిడుగుపాటు శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే ఆ బాలిక మృతి చెందింది.కీర్తి మృతితోచెరుకుమడతలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రభుత్వ అధికారులేగుర్తించిబాలికనుకోల్పోయినతల్లిదండ్రులను అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *