హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునిపై నమోదైన పిడిఎస్ రైస్ కేసును తొలగించడానికి, అలాగే అతనికి విధించిన జరిమానా ప్రక్రియలు పూర్తి చేసి రేషన్ షాప్‌ను తిరిగి తెరవడంలో సహాయం చేస్తానని చెబుతూ 20వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసిన హనుమ రవీందర్ నాయక్, ఈ సందర్భంగా ప్రియదర్ నుండి నగదు తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి పట్టుబడి అరెస్టయ్యారు.నిందితుడిని ఏసీబీ కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News