భీమవరం డిఎస్పి జయసూర్య బదిలీ

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో నూతన డీఎస్పీగా రఘువీర్‌ విష్ణును నియమించారు. పేకాట నిర్వహణ వివాదాల్లో చిక్కుకున్న డీఎస్పీ జయసూర్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే డి.ఎస్.పి జయసూర్య చాలా మంచి అధికారి అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కితాబు ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న ఈ వివాదం జయసూర్య బదిలీకి దారితీసింది. అయితే ఈ బదిలీ రాజకీయ చర్చనీయంగా మారింది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *