గంజాయి రవాణా చేస్తున్న మహిళతో సహా ఏడుగురు అరెస్ట్

నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు శారద నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ గత ఏడాది కాలంగా రవాణానిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నాలుగుసార్లు పట్టు బడినట్లు సమాచారం ఈ కేసులో మరో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక పోలీసు లకు చిక్కింది వాహన తనిఖీల్లో రేణుకతో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.రూ.18.50 లక్షల విలువైన 74 కేజీల గంజాయి ఒక కారు రెండు స్కూటీలు స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఈ పత్రిక సమావేశంలో రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ (షాజహాన్‌పూర్‌) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *