ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు

కొత్తవలస సిఐ షణ్ముఖరావు హెచ్చరిక

కొత్తవలస,ఐఏషియ న్యూస్: నూతన సంవత్సర వేడుకలను ఈనెల 31వ తేదీన కొత్తవలస మండలంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కొత్తవలస సిఐ సి.హెచ్. షణ్ముఖరావు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొనేందుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలకు కొన్ని సూచనలు చేసారని సిఐ మీడియాకు వివరించారు. 31రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మండల వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. వాహనాలను అతివేగంగా నడిపినా, బైక్ రేసులు నిర్వహించినా, ట్రిపుల్ రైడింగు చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆయా వాహనాలను సీజ్ చేస్తామన్నారు. 31న నూతన సంవత్సర వేడుకల పేరుతో అర్ధ రాత్రి ఒంటి గంట తరువాత ప్రజలెవ్వరూ రహదారులపై తిరగరాదన్నారు. మైనర్లుకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వవద్దరాదన్నారు, ఎవరైనా మైనరు డ్రైవింగు చేసి పట్టుబడితే, వారిపైనా, వారికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు లేదా ఆయా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *