పద్మ భూషణ్ డా . అయ్యగారి సాంబ శివరావు మాతృదేశం పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన దేశభక్తుడు, గొప్ప మానవతావాది అని రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె . వి. రమణ నివాళులర్పించారు . ప్రముఖ ఎలెక్ట్రానిక్స్ ఇంజినీర్ , ఇ . సి. ఐ . ల్ . వ్యవస్థాపకులు డా.ఏ. యస్. రావు వర్థంతి సందర్భంగా శనివారం రవీంద్ర భారతి పైడి జయరాజ్ థియేటర్ లో” మహామనీషి డా.ఏ. యస్. రావు “చిత్రాన్ని ప్రదర్శించారు .ఇటీవలే గద్దర్ పురస్కారం అందుకున్న ఈ చిత్రం ఆమహనీయుడికి ఒక అద్భుతమైన నివాళి అని అతిధులందరు ప్రశంసించి చిత్రబృందాన్ని సత్కరించారు . కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మరియు డా.ఏ. యస్. రావు విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ,ముఖ్య అతిధి గా కె. వి. రమణ ,గౌరవ అతిధులుగా మిథానీ సి. యం . డి . డా . యస్. వి. యస్. నారాయణ మూర్తి ,సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి యస్ . వినయ కుమార్ , డా.ఏ. యస్. రావు విజ్ఞాన వేదిక అద్యక్షుడు జి. యాదగిరిరావు ,కార్యదర్శి పి. బి. చారి ,నటుడు నిర్మాత శివ కంఠమనేని పాల్గొన్నారు .కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ,టి. వి.నటుడు బి. డి. యల్ . సత్యనారాయణ నిర్వహించారు .

News Website (iasianews.net) I Asia News