“లండన్ ఉత్సవ్ సమితి వినాయక చవితి వేడుకలు”

లండన్ ఉత్సవ్ సమితి వినాయక చవితి వేడుకలు
లండన్‌లోని సటన్, క్రోయ్‌డాన్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లండన్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సెప్టెంబర్ 19, 2026 (శనివారం) నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై సందడి చేశాయి.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన వినాయకుడికి వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం వేడుకలకు హాజరైన భక్తులందరికీ ఉచిత అన్నదానం నిర్వహించారు.
కుటుంబాలన్నీ ఒకేచోట చేరడంతో వేడుకల ప్రాంగణం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంతో సందడిగా మారింది.
వేడుకల అనంతరం వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ బెడ్డింగ్టన్ పార్క్‌లో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొంటూ, గణపతి నామస్మరణతో స్వామివారికి వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో బెడ్డింగ్టన్ పార్క్ పరిసరాలు మార్మోగాయి. భక్తుల కోలాటాలు, నృత్యాలు నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను భావితరాలకు అందించడంతో పాటు స్థానిక తెలుగు కుటుంబాల మధ్య ఐక్యతను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు భాస్కర్ అమ్మినేని, మురళీకృష్ణ చెరుకూరి, వెంకట్ కంతేటి, మురళి మైనేని ప్రత్యేకంగా కృషి చేశారు. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన వాలంటీర్లు, అన్నదానానికి సహకరించిన దాతలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు, అలాగే వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ లండన్ ఉత్సవ్ సమితి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

About I Asia News

Check Also

Recognizing India as the “Honoured Country” at the 2026 Annual Armed Forces Day Military Ball,

The Consulate General of India, Houston, conveys its deep appreciation to the Houston Military Affairs …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *