హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నగరంలో రద్దయిన పెద్ద నోట్లు భారీమొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News