నంద్యాల,ఐఏషియ న్యూస్: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారిగా శ్యామ్ రాజు ఏడాది జూన్ 30న రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి ఖజానా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45వేలు రూపాయలు డిమాండ్ చేయగా 30వేలు రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. శ్యామ్ రాజు ఫిర్యాదిదారుడు మేరకు ఏసీబీ డిఎస్పి సోమన్న దాడులు చేపట్టారు. డోన్ ఉప ఖజానా కార్యాలయము నందు పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 30 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సోదాలలో డిఎస్పి ఏసిపి సోమన్న,సీఐలు కృష్ణయ్య, రాజ ప్రభాకర్, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.నిందితుడు నాయక్ ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News