ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చించారు. అనంతరం ఆయన కీలక ప్రకటనలు చేశారు. అలాగే విద్యుత్ రంగం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్రానికి ఎలా గుదిబండగా మారాయో వెల్లడించారు.ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయం పై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు.రాష్ట్రంలో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు తెలిపారు.తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది.రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ భవనాలపై సౌరఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణచేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఐస్(ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీద్వారా60రోజుల్లోనేతమకార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూఎనర్జీ హబ్‌గా మారాలని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు.అలాగే విద్యుత్ సంస్థలు రుణసమీకరణలో వడ్డీ భారాన్నితగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ వ్యయం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
గత పాలకులు విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారని సీఎం తెలిపారు. పీపీఏల రద్దు నిర్ణయంతో రూ.9 వేల కోట్ల మేర భారం ప్రజలపై పడిందని పేర్కొన్నారు. విద్యుత్‌ను వినియోగించుకోకుండానే ఆయా విద్యుత్ కంపెనీలకు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని అన్నారు.కూటమిఅధికారంలోకివచ్చాకఈవ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్

అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *