రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్

  • అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి
  • ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుంచి ఏసీ కోచ్ లో ప్రయాణికులకు ఇచ్చే బెడ్ రోల్స్ ఇక నుంచి మామూలు స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం ఏసీ ప్రయాణికులకు మాత్రమే ఉండేది . ఇకనుంచి దాన్ని సాధారణ భోగిల్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వారికి కూడా బెడ్ రోల్స్ ఇస్తారు. అయితే ఇందుకోసం పూర్తిస్థాయిలో బెడ్ రోల్స్ కోసం 50 రూపాయలు చెల్లించాలి. బ్లాంకెట్ మాత్రమే కావాలనుకుంటే 20 రూపాయలు, పిల్లో కావాలనుకున్న వారు 10 రూపాయలు చెల్లించాలి.వీటిని ప్రయోగాత్మకంగా ప్రస్తుతానికి చెన్నై డివిజన్లోని 10 రైళ్లలో అమలు చేస్తున్నారు. వీటి ద్వారా నెలకి 28 లక్షల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.చెన్నై డివిజన్లో 10 రైళ్లలోనే దీన్ని అమలు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మిగిలిన డివిజన్లలో కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఐదేళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలి

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *