ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్‌ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతోమాట్లాడారు.ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి ఒకటి తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు.. ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కేటాయించనున్నారు.మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్ లేని ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారికి తీపికబురు వినిపిస్తూ.. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మరోవైపు జనవరి1, 2020 తర్వాత మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పిస్తారు.లేదా అదనపు ఆర్థిక సాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.మేరకు డిసెంబర్ నెల ప్రారంభంలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కౌన్సిల్‌లో సభ్యత్వం లభించడంతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు త్వరగా పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ సంఘాలు కూడా.. పాల్గొనే అవకాశం ఉంటుందంటున్నారు.మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల.. కొన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోకి తెచ్చింది. ఎన్‌ఎంయూఏ, ఎంప్లాయిస్‌ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఆర్టీసీ ప్రధాన సంఘాలకు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేసింది.రెండు ఆర్టీసీ ప్రధాన సంఘాలకు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం మంజూరు చేసింది.ఈ మేరకు డిసెంబర్ నెల ప్రారంభంలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కౌన్సిల్‌లో సభ్యత్వం లభించడంతో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు త్వరగా పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ సంఘాలు కూడా.. పాల్గొనే అవకాశం ఉంటుందంటున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఆకవలలలో ఒకరు ఎస్పీ మరొకరు ఏసిపి: పోలీస్ శాఖలో ఒక అద్భుతం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *