విజయవాడలో ఇండియన్ ఫిలిం మేకేర్స్ అసోసియేషన్ సమావేశం

విజయవాడ,ఐఏషియ న్యూస్: విజయవాడ నగరంలో , డివి మేనర్ హోటల్లో సోమవారంసాయంత్రం ఇండియన్ ఫిలిం మేకేర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ మీటింగ్, ఏపీ స్టేట్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫంక్షన్ బ్రోచరును విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంబికా కృష్ణ ,ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన అంబటి మధుమోహన్ కృష్ణ , సినీ ప్రముఖులు, ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి నాగులపల్లి పద్మిని,మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు పాలూరు శేషమాంబ,ఇతర సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ నేషనల్ ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ హెచ్ఆర్, నేషనల్ సెక్రెటరీ రామ చంద్ర రెడ్డి పాల్గొని ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ జనరల్ బాడీని అనౌన్స్మెంట్ చేశారు .ఈ జనరల్ బాడీకు ప్రెసిడెంట్ గా మల్లెపుడి రవళి , వైస్ ప్రెసిడెంట్ గా బిమ్మి బాల , పి లక్ష్మీ పూజ, ట్రెజరర్ గా ఎం.రామలక్ష్మి,సెక్రటరీగా అనిల్ కుమార్,జాయింట్ సెక్రెటరీలుగా నిహారిక , మోహన్ శివరాం, ఆర్.జ్యోతి, నీలిమ , జితేంద్ర, వనిత,ఈసీ మెంబర్లు పద్మ ,మొదలగు వారికి ఐడి కార్డులు, అపాయింట్మెంట్ లెటర్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి అయిన అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి ఇలాంటి వేదిక ఎంత అవసరమని సినీ ప్రముఖులకు ఒక వేదిక ఒక రిప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం సంతోష దాయకం అని , ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ సినిమా కార్మికులకు అండగా ఉంటుందని ఆశిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అయిన అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ… ఈ ఐ ఎఫ్ ఎం ఏ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రంగానికి ఎంత తోడ్పాటు పాటిస్తుందని భవిష్యత్తులో విశాఖ, విజయవాడ తదితర ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాల్లో ఇతర ప్రాంతాలకు ఈ సినిమా పరిశ్రమ విస్తరించడానికి ఎంతో దోహద పడుతుందని నాటక రంగానికి,షార్ట్ ఫిలిమ్స్ కు , అలాగే కధార చేతులకు 24 క్రాఫ్ట్స్ లో ఉన్న అన్ని రకాల కార్మికులు , ఔత్సాహిక యువతీ యువకులకు , కార్మికులకు సహయము, తోడ్పాటు అందించాలని అక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న ఏర్పాటు చేయనున్న ఫిలిం ఇంటర్నేషనల్ అవార్డ్స్ వేడుక తాలూకా బ్రోచర్లను విడుదల చేయడం జరిగింది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందీ సినిమా దిగ్గజం ధర్మేంద్ర కన్నుమూత

ముంబయి,ఐఏషియ న్యూస్: మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ‘‘ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *