కైలాసగిరిపై 1,020 అడుగుల ఎత్తుగల గాజువంతెన ప్రారంభం

విశాఖపట్న,ఐఏషియ న్యూస్: విశాఖలోనే ప్రముఖ పర్యాటక కేంద్రం అయినటువంటి కైలాసగిరిపై సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గాజు వంతెనను సోమవారం ఉదయం విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్, వి ఎం ఆర్ డి ఏ ఛైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్,తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు,జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు,మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన మీదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖను అటు ఐటీ పరంగా ఇటు పర్యాటక పరంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ప్రభావంతో విశాఖకు అనేక పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్, పారా గ్లైడింగ్ నెలకొల్పడం జరిగిందని, ఇప్పుడు సుమారు రూ. 7 కోట్ల ఖర్చుతో ఆదాయ భాగస్వామ్యం పద్ధతిలో గాజు వంతెన నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1,020 అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన 40 ఎంఎం మందంగల గాజుతో, దేశంలోనే 55 మీటర్ల పొడవైన నిర్మితమైన మొట్టమొదటి గాజు వంతెన అని తెలిపారు.అదేవిధంగా గంటకు 250 కి.మీ వేగంతో వీచే గాలులను (హూద్ హూద్ వంటి తుఫాన్) కూడా తట్టుకొని నిలబడే విధముగా ఒకేసారి సుమారు 100 మందిని తట్టుకొనే విధముగా రూపకల్పన చేశారని తెలిపారు.ప్రస్తుతం పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొనిఒక్కసారి40మందికిమాత్రమేఅనుమతించడం జరుగుతుందన్నారు.ఈ గాజు వంతెన విశాఖకే ఖ్యాతి తీసుకుంటుందన్నారు.త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్ అందుబాటులో తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.కమిషనర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ విశాఖలో పర్యాటకపరంగా మరిన్ని పెట్టుబడులు వస్తాయని, కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేవిదముగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఏ జాయింట్ కమిషనర్ రమేష్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్,పర్యవేక్షక ఇంజనీర్ మధుసూదన రావు, ఉపకార్యనిర్వహక ఇంజినీర్ రవిశంకర్, నిర్వాహకులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

Telangana Deputy CM Bhatti Vikramarka Launches Title Poster for ‘Pithapuram lo’

‘Pithapuram lo’ is a new film directed by Mahesh Chandra, who is well-known for his …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *