విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని ద.మ.రైల్వే మార్చింది. కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని జోన్ సీపీఆర్వో ఏ.శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం-లింగంపల్లి(12806)రైలువిశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరి, లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం(12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, విశాఖపట్నంకు రాత్రి 7.50కి చేరుకుంటుంది.ఈ మారిన వేళలను ప్రయాణికులు గమనించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News