పరవాడ,ఐఏషియ న్యూస్: పెదముషిడివాడ శివారులోని నక్కవా నిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు.ఈ సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పేకాట వివరాలు తెలియజేశారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లి కార్జునరావు తన సిబ్బందితో కలిసి ఈ నెల 21న రాత్రి 9 గం టల సమయంలో శిబిరంపై దాడి చేశారని పేర్కొన్నారు. అక్కడ పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి మొత్తం రూ.19.20 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 2 బైక్ లు, ఒక కారు, పేక ముక్కలు, చార్జింగ్ లైట్లు, టార్పాలిన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలి పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News