
మోంత తుఫానుపై అధికారులను,ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో మోంత తుఫాను కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం రెండు విడతలుగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా తుఫాను తాకిడి తీరప్రాంత జిల్లాలలో ఉండే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్బంగా కలెక్టర్ కొన్ని సూచనలుజారీ చేసారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ శాఖలు మానవ నష్టం జరగకుండాఅన్నీ ముందస్తు చర్యలు తీసుకోవాలి.ఇరిగేషన్ శాఖ వర్షాల అంచనాలను బట్టి కాల్వల్లో ప్రవాహం, రిజర్వాయర్ల నిల్వ స్థాయిలను పర్యవేక్షించాలి.వ్యవసాయ శాఖ రైతులకు పంట పరిరక్షణ కు సంబందించిన హెచ్చరికలు ఇచ్చి జాగ్రత్త చర్యలు సూచించాలి.పౌర సరఫరాల శాఖ అవసరమైన బియ్యం, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ నిల్వలను తగిన చోట్ల సిద్ధంగా ఉంచాలి.ఆర్‌డబ్ల్యుఎస్, మున్సిపాలిటీ శాఖలు తాగునీటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
ఏపీఈపిడీసీఎల్ శాఖ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా హై అలర్ట్‌లో ఉండాలి. కలెక్టర్ కార్యాలయం, ఆర్డిఓ, మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాలు, విద్యుత్, అగ్నిమాపక శాఖల్లో 24/7 కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలి.
ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖలు అప్రమత్తంగా ఉండి సమన్వయం చేసుకోవాలి.ఆరోగ్య శాఖ వైద్యసేవలను 24 గంటలు అందుబాటులో ఉంచాలి.ఏ అధికారి అయినా అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదిలి వెళ్లరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లాలో మానవ నష్టం ఒక్కటి కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీలు,మండలాలులో లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తగిన ఆహారం, త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు రోడ్లు, కల్వర్టులు చెక్ చేసి, ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వరదలు సంభవించే అవకాశం ఉన్న చెరువులు, నదులు వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలెవ్వరు ప్రవాహ ప్రాంతాలలో సంచరించరాదనీ తెలిపారు.విద్యుత్ శాఖ అధికారులు కంట్రోల్ రూమ్ లు సిద్ధం చేసుకుని పవర్ కట్ ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, మొబైల్ చార్జింగ్ సదుపాయాలు, జనరేటర్లు, సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా సెల్ టవర్లకు విద్యుత్ లేక సిగ్నల్ లేని పరిస్థితి రాకూడదని,వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు.
భారీ గాలులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున పడిపోయిన చెట్లు,హోర్డింగులు వెంట వెంటనే తొలగించడానికి అవసరమైన అన్ని పరికరాలు సిద్ధం చేసుకోవాలన్నారు.తుపాను సమయంలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. సెలవులో ఉన్న అధికారుల సెలవులు రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.తుపాన్ కంట్రోల్ రూముల వివరాలు : కలెక్టర్ ఆఫీస్ : 08922-236947, 8523876706,రెవెన్యూ డివిజినల్ ఆఫీస్,విజయనగరం 8885893515,రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ చీపురుపల్లి 9704995807,రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బొబ్బిలి 9989369511,మున్సిపల్కా ర్పొరేషన్ విజయనగరం 9849906486,ఏపీ ఈపీడీసీఎల్ 9490610102,టోల్ ఫ్రీ నెంబర్ 1912 సంప్రదించాలన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News