ఆన్లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుకు పరిశీలన

సింహాచలం,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సూచనల మేరకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానమునందు భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో పలు గదులు, దర్శనములు, అభిషేక పూజలు, ఇతర సేవలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్ లైన్ ద్వారా వివిధ సేవలు,దర్శనములు, టికెట్లు,ప్రసాదములు బుక్ చేసుకునే భక్తులను ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనం చేసుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్ల కొరకు సోమవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి శ్రీమతి ఎన్. సుజాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ వి రమణ, సహాయ కార్యనిర్వాహణాధికారి తిరుమలేశ్వరావు, ఏ ఇ రవిరాజు బృందము ఆన్ లైన్ లో స్వామివారి దర్శనంనకు టికెట్ తీసుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్లైన్ టికెట్ కలిగిన భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ.వో అధికారులకు సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *