సింహాచలం,ఐఏషియ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న క్రీడాకారిణులకు ఆలయ అధికారులు ఘన స్వాగతంపలికారు.ఆలయసహాయకార్యనిర్వహణాధికారి కోన తిరుమలేశ్వరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావుక్రీడాకారిణులకుఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్లేయర్స్ అందరూ ఆలయంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద ఆశీర్వచనం – సత్కారం
దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు క్రీడాకారిణులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంలతోను ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.lఈ దర్శన భాగ్యం పొందిన వారిలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణులు స్మృతి మంధాన,హర్మన్ ప్రీత్ కౌర్,రేణుక సింగ్,షఫాలీ వర్మ,వైష్ణవి శర్మ,అమర్ ప్రీత్ కౌర్,క్రాంతి గౌడ్,శ్రీ చరణి,అంపైర్ డి.ఎస్. లక్ష్మి, బృందా రాతి తదితరులు ఉన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News