పూర్ణమార్కెట్ లో అగ్నిప్రమాదం: పలు పూజ సామాగ్రి దుకాణాలు దగ్ధం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ ఉన్న ఆరు పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆస్తినష్టం ఎంత జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

తాజ్ మహల్ సందర్శించిన జూనియర్ ట్రంప్

తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా..అందంగా: జూనియర్ ట్రంప్ కితాబు ఆగ్రా,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *