టీటీడీ వారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ప్రవచనం

వరంగల్,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో వరంగల్ మహానగరం కేంద్రంగా కూనూరు జాఫర్గడ్డ వద్ద శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తిరుప్పావై సేవా కాలం తీర్థ గోష్టి తదనంతరము విశాఖపట్నంకి చెందిన “ఆగమ వైభవ బ్రహ్మ”, “వైష్ణవరత్న” శ్రీమాన్ గుంటూరు జనార్ధనాచార్యులు టీటీడీ వారి తరఫున ప్రవచనాన్ని ఇస్తున్నారు. ఈ ప్రవచనాన్ని పర్యవేక్షించడానికి ఇన్స్పెక్టర్ వంశీకృష్ణమాచార్యులు వచ్చి ఆలయాన్ని ప్రవచనాన్ని పరిశీలించి వారి అనుగ్రహ భాషణం అందించారు.ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్త నెల్లుట్ల వకులాదేవి భక్తులు, గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *