మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటిన మొంథా తుఫాన్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది.తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్‌, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ..అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు అల్లూరి, ఏలూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల,నంద్యాల, ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలుకాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం,కడప..కర్నూల్‌, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి హెచ్చరించారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *