ఏకపక్షంగా లక్షల ఓట్లు రద్దు చేయడం దారుణం

మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఓట్లు సవరణల పేరుతో ఏకపక్షంగా 67 లక్షల ఓట్లను బీహార్లో రద్దు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఎం జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వి వి జవహర్లాల్ అధ్యక్ష వహించారు. వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణల పేరుతో లక్షలాది ఓట్లు తీసివేయడం అన్యాయమని వారన్నారు. ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని అన్నారు. ఓటరుగా నమోదు అవ్వడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డుల వంటివి ప్రామాణికంగా తీసుకుంటారని అన్నారు. అందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్ ఇక్కడ ప్రత్యేక సమగ్ర సవరణల పేరుతో ఇక్కడే జన్మించాను అని రుజువు చేసే పత్రాలను సమర్పించ మనడంతో నిరుపేదలు కూలీలు, వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ దేశంలో పుట్టినట్లు నిరూపించుకునే బంధనాలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఇలాంటి నిబంధనలే తీసుకువచ్చే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అడ్డగోలుగా నిబంధనలను తీసుకు వస్తున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీ అలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎం చంద్రారావు, ఎం నాగేశ్వరావు, టి శ్రీనివాసరావు, కెవిపిఎస్ నాయకులు బి స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *