ప్రియాంకగాంధీ కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం

రాజస్థాన్ ,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్‌ అగ్రనేత,లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్‌ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్‌ వాద్రా(25)కు అతని గర్ల్‌ఫ్రెండ్‌ అవీవా బేగ్‌(23)తో నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రణ్‌థంబోర్‌లో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ఈ వేడుక జరిగినట్టు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం రేహాన్‌, అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో రేహాన్‌ ఇటీవల చేసిన పెళ్లి ప్రతిపాదనకు అవీవా అంగీకారం తెలిపారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *