సివిల్స్ ఫ్రీ క్వాలిఫై విద్యార్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యారంగంపై దృష్టి సారించి పలు కీలక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ లాంటి అత్యంత కఠినమైన పోటీ పరీక్షలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వాళ్లు మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పంపిణీ చేసింది. ఈమేరకు చెక్కులను విడుదల చేసింది. దీనిలో భాగంగానే సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు చెక్కులు అందజేశారు అధికారులు.తెలంగాణలో సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్ధులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్న అభ్యర్ధులకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వారి కోసం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరుతో కొత్త పథకాన్ని ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1 లక్ష అందిస్తుంది. తాజాగా సివిల్స్-2025 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన 178 మంది అభ్యర్థులకు అధికారులు చెక్కులు అందజేశారు.

Authored by: Vaddadi udayakumar

 

About admin

Check Also

విద్యా వ్యాప్తి కోసం అనిల్ అగర్వాల్ 21,000 కోట్ల రూపాయల విరాళం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బీహార్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన అనిల్ అగర్వాల్ భారత దేశంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *