నేడు,రేపు టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం

అమరావతి,ఐఏషియ న్యూస్: పదవ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం వరకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెల్లించవచ్చన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు కూడా అదే వెబ్ సైట్ నుంచి ఫీజులు కట్టొచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు చివరి రోజు వరకు వేచిచూడ కుండా వీలైనంత త్వరగా ఫీజులు చెల్లించాలన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *