
- పసుపు రైతులకు ఉచితంగా ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలి
- ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్
హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లోసురేంద్ర, మండల కార్యదర్శి టి క్రిష్ణరావు జీకే మండ పంచాయతీ గడ్డిమర్రి గ్రామంలో ఆదివాసులు పండిస్తున్న పసుపు పంటలను గురువారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో
మాట్లాడుతూ ఆదివాసి ప్రాంతంలో పండిస్తున్న ఏజెన్సీ బంగారం పసుపు కిలో రూ :200 కొనుగోలు చేస్తే తప్పా రైతులకు గిట్టుబాటురాదన్నారు.ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ చేయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని ఎత్తివేసి ఉపాధిహామీ పథకంగా మార్చడాన్ని ఆదివాసి గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని పార్లమెంట్ సమావేశంలో సవరించి,వాటిని ఒక పథకంగా మార్చడాన్ని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం వాటా తగ్గించుకుని రాష్ట్ర వాటాలు 40 శాతానికి పెంచి ఉపాధి హామీ పథకం ఎత్తివేయాలని కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఉపాధి హామీ చట్టం తొలగిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి లేక వలసలు పెరుగుతుంది అన్నారు.తద్వారా గంజాయి తదితర మాదక ద్రవ్యాల విక్రయాలు కూడ పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలైన జివో నంబర్ 3 తదితర హక్కులు తొలగించడంతో ఆదివాసీ ప్రజలకు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.ఉపాధి హామీ చట్టం రక్షణకు పోరాటం చెయ్యాలని పిలిపిస్తుంది.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు, పసుపు రైతులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News