సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ దారులకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకులు అందించే సేవల విషయంలో అందరికీ సమానమైన సర్వీసులు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు నెలలో అన్‌లిమిడెట్ డిపాజిట్స్, ఉచిత ఏటీఎం లేదా డేబిట్ కార్డ్ వినియోగానికి అవకాశం కల్పించాలి. ఫ్రీ ఏటీఎం కార్డు జారీ, చెక్ బుక్ (ఏడాదికి 25 లీఫ్స్) ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ ఖాతాలకు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందించాల్సి ఉంటుంది.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన కొత్త రూల్స్ 2026, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. సవరించిన కొత్త నిబంధనలను బ్యాంకులు కచ్చితంగా పాటించాలని, తమ ఖాతాదారులకు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమానమైన సేవలు అందించాలని సూచించింది. బ్యాంకులు వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించింది. మరి ఆర్‌బీఐ బీఎస్‌బీడీ అకౌంట్ సవరించిన నిబంధనలు తెలుసుకుందాం.
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్ ఇవే
బీఎస్‌బీడీ ఖాతాల్లో క్యాష్ డిపాజిట్ ఛార్జీలు విధించకూడదు.యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవు.ఇకపై ఆదాయం ఆధారంగా ఎంపిక ఉండదు. బ్యాంకులు ఆదాయం, ప్రొఫైల్ ఆధారంగా సేవింగ్స్,ఖాతాఇచ్చేందుకునిరాకరించకూడదు.సాధారణ సేవింగ్స్ అకౌంట్ల మాదిరిగానే పూర్తి బ్యాంకింగ్ సర్వీసులు అందించాల్సిందే.కేవైసీ, ఏఎంఎల్, రిస్క్ నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలి.అన్ని బ్యాంకుల్లో ఒక వ్యక్తికి ఒకే బీఎస్‌బీడీ అకౌంట్ ఉండాలి.ఒక వ్యక్తి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, బీఎస్‌బీడీ అకౌంట్ తీసుకోవడానికి లేదు.నిబంధనలు అమలు చేసేందుకు బ్యాంకులు కస్టమర్ల అనుమతి తీసుకోవాలి.ప్రతి నెలా 7, 14, 21 సహా నెలాఖరున అంటే వారానికోసారి కచ్చితంగా ఖాతాదారుల లావాదేవీల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు అందించాలి.బెటర్ క్రెడిట్ ట్రాకింగ్, ఫాస్టర్, సేఫర్ లెండింగ్ బ్యాంకులో దృష్టి సారించాలి. ఈ నిబంధనలను ప్రతి ఒక్క సేవింగ్ డిపాజిట్ ధరలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *