ముగ్గురు ఐపీఎస్ లకు ఐఏఎస్ హోదా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం

  • నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేసిన వడ్ల శ్రీకాంత్
  • తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: శిఖా గోయల్,సిపి సజ్జనార్ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వడ్ల శ్రీకాంత్, అతని తరపున విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో వాదనలు చేశారు.
ఈ పిటిషన్ హైకోర్టు విచారిస్తూ శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర,అయితే ఇందులో సిపి సజ్జనార్ పేరు కూడా ఉంది ఆయనకు కూడా త్వరలో ఐఏఎస్ హోదా ఇవ్వబోతున్నారు. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారో ఈనెల 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద సోమవారం నోటీసులు జారీ చేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *