2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్

  • జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు
  • ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్

ఆస్ట్రేలియా (మెల్బోర్న్),ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చడమే మా లక్ష్యం. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య సేవా నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి శ్రీమతి ఎలోడీ జర్నెట్ అధ్యక్షత వహించగా, లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతోంది, గత 16నెలల్లోనే $117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. సుదీర్ఘమైన పాలనానుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వల్లే ఇది సాధ్యమైంది. ఏరోస్పేస్, డిఫెన్స్‌, అగ్రిటెక్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌, డీప్‌టెక్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌, లాజిస్టిక్స్‌, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విశేష పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి.
విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్, డేటా హబ్‌గా తయారవుతోంది.విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ హబ్ నిర్మించబోతోంది. అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.35లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతోంది. భారీ పెట్టుబడులకు విశాఖపట్నం గేట్ వేగా మారింది. విశాఖ మహానగరం 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధిస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలు ప్రారంభించబోతున్నాం. ఇది భారత సాంకేతికరంగంలో గేమ్ ఛేంజర్ కాబోతుంది. అమరావతి క్వాంటం వ్యాలీ లో స్టేట్ డేటా లేక్‌, అవేర్ హబ్‌, ఇంటెలిజెన్స్ లేయర్‌, డిజిటల్ గవర్నెన్స్ వంటివి అంతర్భాగాలుగా ఉంటాయి. ప్రస్తుతం $180 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ… 2047నాటికి $2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికబద్ధంగా, వేగవంతంగా ముందుకు సాగుతోంది, నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో తాము ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025కు ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలు హాజరై ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *