మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ నేవీ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించారు, మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపారు.బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నారు.సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించి, మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడుస్పష్టం చేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించండి

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *