లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ మండల సర్వేయర్

సికింద్రాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న కిరణ్ మంగళవారం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్ కుమార్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకుఆయన రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్ మాన్ ద్వారా లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరపరచనున్నట్లు అధికారులు తెలిపారు.నిజమాబాద్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సర్వేయర్ తాజాగా ఏసీబీకి చిక్కడంతో నిజామాబాద్ ఆయన ఇంట్లో, ఏడీ కార్యాలయంలో సైతం తనిఖీలు చేపట్టారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *