రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ (షాజహాన్‌పూర్‌) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న ఐదుగురు చనిపోయారని ఎస్పీ రాజేష్ ద్వివేదీ తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు ఎస్పీ.మృతులు సేథ్ పాల్(40),అతని భార్య పూజ(38), వారి ఆరేళ్ల ఇద్దరు పిల్లలు, సేథ్ పాల్ బావమరిది హరి ఓమ్(45)గా గుర్తించారు పోలీసులు. వీరంతా లఖీంపుర్ జిల్లాలోని వంకా గ్రామానికి చెందిన వారని ఎస్పీ ద్వివేదీ తెలిపారు. నిగోహి గ్రామంలో హరి ఓమ్ ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా ఈ ఘనన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

భీమవరం డిఎస్పి జయసూర్య బదిలీ

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *