హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్లోముగ్గురుడ్రగ్,పెడ్లర్లు,ఒకవినియోగదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టైన వారిలో ఒక మహిళా టెక్కీ ఉండటం సంచలనంగా మారింది. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందినవారిగా గుర్తించారు.పోలీసులు వారి వద్ద నుంచి హైడ్రోపోనిక్ గంజాయి 22 గ్రాములు, ఎండిఎంఏ 5 గ్రాములు, ఎక్స్టసీ మాత్రలు 5.57 గ్రాములు, ఎల్ఎస్ఈ బ్లాట్స్ 6, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా డార్క్ వెబ్ ద్వారా మాదకద్రవ్యాలను సేకరించి, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమ్మిడి ఇమాన్యుయేల్. ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న అతడు తొలుత డ్రగ్స్ వినియోగదారుడిగా ఉండి, క్రమంగా పెడ్లర్ గా మారినట్లు విచారణలో తేలింది.
అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు పోలీసులుతెలిపారు.ఇమాన్యుయేల్ లివ్-ఇన్ పార్ట్నర్ అయిన సుస్మితాదేవి అలియాస్ లిల్లీ, హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తోంది.ఆమె డ్రగ్స్ విక్రయానికి సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలునిర్వహిస్తూ, తన బ్యాంక్ ఖాతాలోకి అక్రమఆదాయాన్ని తీసుకునేదని పోలీసులు తెలిపారు.ఇమాన్యుయేల్ లేని సమయంలో ఆమె స్వయంగాడ్రగ్స్ సరఫరా వ్యవహారాలను చూసుకునేది. జి.సాయి కుమార్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్లో డ్రగ్స్,పంపిణీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రోడ్డుపక్కన వానరాల కళేబరాలు: కడప జిల్లాలో దారుణం

కడప,ఐఏషియ న్యూస్: కడప జిల్లాలో దారుణం జరిగింది. పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలో మంగళవారం సాయంత్రం వానరాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *