బ్లూబర్డ్‌ ఉపగ్రహ ప్రయోగం 21కి వాయిదా

తిరుపతి,ఐఏషియ న్యూస్: ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్‌’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే రాకెట్‌ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్‌లోని రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 21న షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి ఎగరనుంది. అయితే ప్రయోగా తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాకెట్‌లో వినియోగించే లిక్విడ్‌ను తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో షార్‌కు తీసుకొచ్చారు. ప్రయోగానికి అన్ని సన్న హాలు చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అతి చిన్నదేశపు ఒక్కనోటు మన కరెన్సీలో 7 లక్షలకు సమానం

షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం సుమా బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే అత్యంత పవర్‌ ఫుల్‌ కరెన్సీ గురించిన మాట్లాడుకుంటే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *